నాడు-నేడు పేరుతో YCP నేతల దోపిడీ: నక్కా ఆనంద్‌బాబు

ABN , First Publish Date - 2022-06-11T21:25:39+05:30 IST

నాడు-నేడు పేరుతో వైసీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు.

నాడు-నేడు పేరుతో YCP నేతల దోపిడీ: నక్కా ఆనంద్‌బాబు

అమరావతి: నాడు-నేడు పేరుతో వైసీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలకు వాస్తవాలు మాట్లాడడం చేతకాదన్నారు. చదువు లేని బేవర్స్‌ బ్యాచ్‌ని మంత్రులు, ఎమ్మెల్యేలుగా పెట్టారని తప్పుబట్టారు. విద్యావ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని దుయ్యబట్టారు. ఏపీలో అసలు సంక్షేమ పరిపాలనే లేదన్నారు. ఆకతాయితనంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆనంద్‌బాబు మండిపడ్డారు.

Read more