వెంకన్నకు ముస్లిం దంపతుల విరాళం రూ.1.02 కోట్లు

ABN , First Publish Date - 2022-09-21T09:17:03+05:30 IST

తిరుమల వేంకటేశ్వరస్వామికి ముస్లిం దంపతులు మంగళవారం రూ.1.02 కోట్లు విరాళంగా ఇచ్చారు.

వెంకన్నకు ముస్లిం దంపతుల విరాళం రూ.1.02 కోట్లు

తిరుమల, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తిరుమల వేంకటేశ్వరస్వామికి ముస్లిం దంపతులు మంగళవారం రూ.1.02 కోట్లు విరాళంగా ఇచ్చారు. చెన్నైకి చెందిన సుభీనాభాను, అబ్దుల్‌ ఘనీ దంపతులు ఈ విరాళాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ఇందులో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.15 లక్షలు, ఇటీవల తిరుమలలో ఆధునికీకరించిన పద్మావతి విశ్రాంతి భవనంలో నూతన ఫర్నిచర్‌, వంటశాలలో పాత్రలకు రూ.87 లక్షలు వినియోగించాలని కోరారు. కాగా.. గత 30 ఏళ్లుగా తిరుమల శ్రీవారికి అబ్దుల్‌ ఘనీ దంపతులు విరాళాలు ఇస్తున్నారు. ఇన్నేళ్లుగా ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచినా.. తాజాగా టీటీడీ ఆయన వివరాలను వెల్లడించింది.

Read more