-
-
Home » Andhra Pradesh » MPs should resign for special status-NGTS-AndhraPradesh
-
హోదా కోసం ఎంపీలు రాజీనామా చేయాలి
ABN , First Publish Date - 2022-03-16T08:55:58+05:30 IST
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఎంపీలు రాజీనామా చేయాలని..నీతి, నిజాయితీ, ధైర్యం ఉంటే ప్రధాని మోదీ ఇంటి ఎదుట ధర్నాలు చేసి రాష్ట్ర భవిష్యత్‌కాపాడాలని ప్రత్యేక హోదా సాధన సమితి చైర్మన్ చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

ధైర్యం ఉంటే మోదీ ఇంటిముందు ధర్నాలు చేయండి
ఈ నెల 21న తిరుపతి, 23న రాజమండ్రిలో సదస్సులు
ప్రత్యేక హోదా సాధన సమితి సదస్సులో చలసాని
ఒంగోలు (కార్పొరేషన్), మార్చి 15: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఎంపీలు రాజీనామా చేయాలని..నీతి, నిజాయితీ, ధైర్యం ఉంటే ప్రధాని మోదీ ఇంటి ఎదుట ధర్నాలు చేసి రాష్ట్ర భవిష్యత్‌కాపాడాలని ప్రత్యేక హోదా సాధన సమితి చైర్మన్ చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వామపక్షాల ఆధ్వర్యంలో ఒంగోలులో మంగళవారం జరిగిన ప్రత్యేక హోదా సాధన-విభజన అంశాలపై నిర్వహించిన సదస్సుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, చలసాని శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చలసాని మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక హోదా సాధన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 21న తిరుపతిలో, 23న రాజమండ్రిలో సదస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.