ఒకప్పుడు దొంగలు... ఇప్పుడు పోలీసులు: ఎంపీ రఘురామ

ABN , First Publish Date - 2022-10-02T22:48:41+05:30 IST

ఒకప్పుడు దొంగలు... ఇప్పుడు పోలీసులు: ఎంపీ రఘురామ

ఒకప్పుడు దొంగలు... ఇప్పుడు పోలీసులు: ఎంపీ రఘురామ

ఢిల్లీ: విజయ్‌పై తమ పార్టీ వాళ్లు కావాలనే కేసు పెట్టారని ఎంపీ రఘురామ అన్నారు. ఒకప్పుడు దొంగలు వస్తున్నారు జాగ్రత్త అనుకునేవారు.. ఇప్పుడు పోలీసులు వస్తున్నారు జాగ్రత్త అని అనుకుంటున్నారని విమర్శించారు. విజయ్‌ ఉండి ఉంటే తనను ఎత్తుకెళ్లినట్లే అతన్ని కూడా తీసుసుకుపోయేవారని పేర్కొన్నారు. విజయ్ ఇంటి ముందు సీఐడీ రెక్కీ నిర్వహించిందన్నారు. నోటీసులు ఇవ్వడానికి వచ్చిన సీఐడీ ఎలా సోదాలు నిర్వహిస్తుంది?, పిల్లలు, పనిమనుషులను ఎలా బెదిరిస్తారు? అని ఆయన ప్రశ్నించారు. ఏపీ సీఐడీపై రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రికి టీడీపీ ఫిర్యాదు చేయాలని సూచించారు. రేపు కొత్త ప్రభుత్వం, కొత్త హోంమంత్రి వస్తారని, కొందరు పోలీసులు అప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటారని వ్యాఖ్యానించారు. 

Read more