మోదీ నిర్ణయంతోనే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్: జీవీఎల్

ABN , First Publish Date - 2022-02-23T23:18:37+05:30 IST

ప్రధాని మోదీ నిర్ణయంతో దేశంలో ఆజాదీ కా అమృత్

మోదీ నిర్ణయంతోనే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్:  జీవీఎల్

విజయవాడ: ప్రధాని మోదీ నిర్ణయంతో దేశంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుగుతోందని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నగరంలో ఎగ్జిబిషన్‌ను డీఆర్డీఓ ఏర్పాటు చేసింది.  డీఆర్డీఓ అధికారులు పలు క్షిపణులను ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రదర్శనను  జీవీఎల్ తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం నిర్వహించే పలు సంస్థలు తమ‌ ప్రతిభను ప్రదర్శిస్తున్నాయన్నారు. డీఆర్డీఓ పదహారు సెంటర్లలో ప్రదర్శనలు నిర్వహిస్తోందన్నారు. డీఆర్డీఓ నుంచీ తయారయిన పలు మిసైళ్ళను ప్రదర్శనకు ఉంచారన్నారు. ఈ ప్రదర్శనను విద్యార్ధులు తిలకించి విజ్ఞానాన్ని పెంచుకోవాలని ఆయన అన్నారు. 

Read more