అరుదైన వన్యమృగం మౌస్‌-డీర్‌ లభ్యం

ABN , First Publish Date - 2022-09-25T09:39:49+05:30 IST

అరుదైన వన్యమృగం ‘మౌస్‌-డీర్‌’ అడవి నుంచి దారి తప్పి అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం లోసంగి గ్రామంలో గిరిజనుల చేతికి చిక్కింది. శనివారం గిరిజనుల పిల్లలు మౌస్‌-డీర్‌

అరుదైన వన్యమృగం మౌస్‌-డీర్‌ లభ్యం

నర్సీపట్నం, సెప్టెంబరు 24: అరుదైన వన్యమృగం ‘మౌస్‌-డీర్‌’ అడవి నుంచి దారి తప్పి అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం లోసంగి గ్రామంలో గిరిజనుల చేతికి చిక్కింది. శనివారం గిరిజనుల పిల్లలు మౌస్‌-డీర్‌ పిల్లతో ఆడుకుంటుండగా నర్సీపట్నం ప్రాంతానికి చెందిన జానకిరామ్‌ గమనించారు. దానిని స్వాధీనం చేసుకొని నర్సీపట్నం అటవీ అధికారులకు సమాచారం అందించారు. రేంజ్‌ అధికారి అప్పలనర్సు పరిశీలించి...ఈ రకం వన్య మృగం రాష్ట్రంలోని అడవుల్లో వున్నట్టే తమకు తెలియదన్నారు. అరుదైన వన్యమృగమని రేంజ్‌ అధికారి అప్పలనర్సు తెలిపారు. ఆదివారం ఉదయం విశాఖపట్నం జూకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మౌస్‌ డీర్‌ లేదా చెవ్రోటైన్‌ అనేది జింక జాతిలో అతి చిన్న ప్రాణి. 

Updated Date - 2022-09-25T09:39:49+05:30 IST