ఏపీలో ఖాళీకానున్న 5 ఎమ్మెల్సీ స్థానాలు

ABN , First Publish Date - 2022-12-30T17:43:02+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో 2023 మార్చి 29 నాటికి 5 ఎమ్మెల్సీ స్థానాలు (MLC seats) ఖాళీకానున్నాయి.

ఏపీలో ఖాళీకానున్న 5 ఎమ్మెల్సీ స్థానాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో 2023 మార్చి 29 నాటికి 5 ఎమ్మెల్సీ స్థానాలు (MLC seats) ఖాళీకానున్నాయి. ఈ నేపథ్యంలోనే సవరించిన ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేసింది. మార్చి 29న గ్రాడ్యుయేట్, టీచర్స్‌ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీకానున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు-గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం, కడప, అనంతపురం (Kadapa, Anantapur), కర్నూలు-గ్రాడ్యుయేట్ నియోజకవర్గం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ-గ్రాడ్యుయేట్ నియోజకవర్గం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు-టీచర్స్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గం, కడప, అనంతపురం, కర్నూలు-టీచర్స్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గాలు ఖాళీ కానున్నాయి.

Updated Date - 2022-12-30T17:43:03+05:30 IST