ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ పొడిగింపు

ABN , First Publish Date - 2022-08-24T01:26:53+05:30 IST

ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ పొడిగింపు

ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ పొడిగింపు

అమరావతి: ఎమ్మెల్సీ అనంతబాబుకు వచ్చే నెల 5వ తేదీ వరకూ బెయిల్‌ పొడిగించారు. అనంతబాబుకు జిల్లా కోర్టు ఇచ్చిన బెయిల్‌ పొడిగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తన తల్లి మరణించడంతో ఆమె పెద్ద కర్మ అయ్యే వరకూ బెయిల్‌ పొడిగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు అనంతబాబుకు మూడు రోజులు బెయిల్‌ మంజూరు చేసింది. మూడు రోజులు చాలదంటూ తన తల్లి పెద్ద కర్మ అయ్యే వరకూ బెయిల్‌ పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల 5వ తేదీ వరకూ బెయిల్‌ పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Read more