లోకేశ్‌ ఓ డాష్‌ గాడు: ఎమ్మెల్యే ద్వారంపూడి

ABN , First Publish Date - 2022-02-19T09:33:46+05:30 IST

‘‘నన్ను ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనీ, టీడీపీ అధ్యక్షుడిని నారా చంద్రబాబు నాయుడు అని అంటారు....

లోకేశ్‌ ఓ డాష్‌ గాడు: ఎమ్మెల్యే ద్వారంపూడి

కార్పొరేషన్‌(కాకినాడ), ఫిబ్రవరి 18: ‘‘నన్ను ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనీ, టీడీపీ అధ్యక్షుడిని నారా చంద్రబాబు నాయుడు అని అంటారు.. అయితే నారా లోకేశ్‌ని నాయుడు అనాలో ఏమనాలో నాకైతే తెలియడం లేదు. అందుకే లోకేశ్‌... ఓ డాష్‌ గాడని సంబోధిస్తా’’ అని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అన్నారు. శుక్రవారం కాకినాడలోని తన నివాసంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘టీడీపీ తొత్తు, చంద్రబాబు దగ్గర జీతానికి పనిచేసే పట్టాభి... కాకినాడ రైస్‌ ఎక్స్‌పోర్ట్‌లో అక్రమాలు జరుగుతున్నాయని పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడు. చంద్రబాబు, లోకేశ్‌ వారి తొత్తులకు చెప్పాలి... జగన్మోహన్‌రెడ్డి గురించి కానీ, వైసీపీ ప్రభుత్వం గురించి కానీ మాట్లాడే ముందు అన్నీ తెలుసుకుని మాట్లాడాలి. లేనిపోని ప్రగల్భాలు పలకడం, తోక పత్రిక, తోక చానల్‌లో వేసుకోవడం చేస్తున్నారు. పట్టాభి అనే వాడు పోయినసారి కాకినాడ వస్తే బడితపూజ చేయాలని కొందరు మత్స్యకార నాయకులు టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు’’ అని ద్వారంపూడి వ్యాఖ్యానించారు.

Read more