MLA Vamsi: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శటీ పేరు మార్పుపై ఎమ్మెల్యే వంశీ స్పందన..

ABN , First Publish Date - 2022-09-21T18:37:57+05:30 IST

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు అంశంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందన...

MLA Vamsi: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శటీ  పేరు మార్పుపై ఎమ్మెల్యే వంశీ స్పందన..

అమరావతి (Amaravathi): ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ (NTR Health University)  పేరు మార్పు అంశంపై ట్విట్టర్ ద్వారా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) స్పందించారు. ‘‘గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్  రెడ్డి గారు.. మీరు ఎంతో పెద్ద మనసుతో తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకైన నందమూరి తారక రామారావు (Nandamuri Tarakaramarao) గారి పేరుతో జిల్లా ఏర్పాటు చేసి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవ్వని గుర్తింపునిచ్చి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. నిజంగా అది ఎంతో చారిత్రాత్మకం.. విప్లవాత్మకం.. అదే జిల్లాలో ఎన్టీఆర్ గారి చొరవతోనే ఏర్పాటైన ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కారణజన్ముడైన ఆ మహనీయుడి పేరే కొనసాగించే అవకాశాన్ని పరిశీలించాలని మనఃపూర్వక విజ్ఞప్తి’’ అంటూ వల్లభనేని వంశీ ట్వీట్ చేశారు.

Read more