Balakrishna: ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న బాలకృష్ణ..

ABN , First Publish Date - 2022-10-05T12:56:40+05:30 IST

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Balakrishna: ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న బాలకృష్ణ..

విజయవాడ: సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఇంద్రకీలాద్రి కనకదుర్గ (Kanakadurga) అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలయ్యకు అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందుకున్నారు. ఆలయ అధికారులు అమ్మ వారి లడ్డూ ప్రసాదం, చిత్రపటాన్ని బాలకృష్ణకు అందించారు. 


ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ...

శరన్నవరాత్రులలో భాగంగా ఈ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకున్నానని చెప్పారు. అమ్మవారి కరుణకటాక్షాలు భక్తులపై ఉండాలని, రాష్ట్రాభివృద్ది జరిగి,  ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానన్నారు. మానవ శాంతి ఉంటే ప్రపంచ కల్యాణం జరుగుతుందని, చెడు మీద మంచి, అధర్మము మీద ధర్మం గెలిచిన రోజు కాబట్టి ఈ రోజు ఏ పని ప్రారంభించిన విజయం సాధిస్తుందన్నారు. విజయదశమి రోజు కాబట్టి అన్ స్టాపబుల్ కోసం ఇక్కడికి వచ్చానని బాలకృష్ణ అన్నారు.


కాగా ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 10వ రోజు బుధవారం కనకదుర్గ (Kanakadurga) అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. విజయదశమి నాడు అమ్మవారిని దర్శించుకుంటే అన్ని విజయాలు చేకూరతాయని భక్తుల విశ్వాసం.. షోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణి మహాత్రిపుర సుందరి, శ్రీచక్ర అధిష్టానదేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి విజయదశమి అపరాజితాదేవి పేరు మీద ఏర్పడింది. విజయాన్ని సాధించిది కాబట్టి విజయ అని అంటారు. పరమశాంతి రూపంతో చిరునవ్వులు చిందిస్తూ చెరకుగడ చేతితో పట్టుకుని అమ్మవారు భక్తులకు దర్శనమిస్తోంది. 

Updated Date - 2022-10-05T12:56:40+05:30 IST