భూ ఆక్రమణ నిరూపిస్తే రాజకీయ సన్యాసం: అవంతి

ABN , First Publish Date - 2022-03-16T09:20:57+05:30 IST

ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న తనపై ఒక్క ఆరోపణా లేదని, తాను భీమిలిలో ఒక్క గజం భూమి అయినా ఆక్రమించానని నిరూపిస్తే రాజకీయ

భూ ఆక్రమణ నిరూపిస్తే రాజకీయ సన్యాసం: అవంతి

అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న తనపై ఒక్క ఆరోపణా లేదని, తాను భీమిలిలో ఒక్క గజం భూమి అయినా ఆక్రమించానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని మంత్రి అవంతి శ్రీనివాస్‌ సవాల్‌ చేశారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన ఆవిర్భావ సభలో పవన్‌ కల్యాణ్‌ సత్యదూరమైన మాటలు మాట్లాడారని మండిపడ్డారు. పవన్‌ ప్యాకేజీ స్టార్‌ అని విమర్శించారు. ‘చంద్రబాబును సీఎం చేయడానికి పార్టీ పెట్టావా? టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నావ్‌? ఎందుకు విరమించుకున్నావ్‌? బీజేపీతో పొత్తుతో రాష్ట్రానికి ఏంసాధించావ్‌?’ అని ప్రశ్నించారు. 

Read more