కర్నూల్‎లో అర్ధరాత్రి పోలీసుల తనిఖీలు

ABN , First Publish Date - 2022-08-24T12:09:55+05:30 IST

నగరంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత పోలీసులు అకస్మికంగా తనిఖీ చేపట్టారు. వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు పలు కూడళ్లలో

కర్నూల్‎లో అర్ధరాత్రి పోలీసుల తనిఖీలు

కర్నూలు: నగరంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత పోలీసులు అకస్మికంగా తనిఖీ  చేపట్టారు. వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు పలు కూడళ్లలో ముమ్మరంగా తనిఖీలు చేశారు. ఎస్పీ సిద్ధ్దార్థ కౌశల్‌ ఈ తనిఖీ లను అకస్మికంగా పరిశీలించారు. ఆయన కాలినడకన వెళ్లి పలు కూడళ్లలో  గస్తీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాత్రివేళల్లో తిరిగే అనుమానాస్పద వ్యక్తులను విచారించి నేరాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణంలోని ఒకటో, రెండో  పట్టణ పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని ఆనంద్‌ సినీ కాంప్లెక్స్‌, బంగారుపేట వెనుకవైపు, కేసీ కెనాల్‌ వెంబడి కాలినడకన పర్యటించి అసాంఘిక  కార్యకలాపాల గురించి ఆరా తీశారు. అశోక్‌నగర్‌, భగత్‌సింగ్‌ కాలనీ, వెంటరమణ కాలనీ, కప్పల్‌నగర్‌, మమత నగర్‌, స్టాంటన్‌పురం, బాలాజీ నగర్‌, కేశవరెడ్డి స్కూల్‌, వెంకటరమణ కాలనీ మెయిన్‌ రోడ్డులో ఆయన అకస్మికంగా పర్యటించి తనిఖీలు చేశారు. సంతోష్‌నగర్‌ నుంచి  వెంకటరమణ కాలనీ వైపు వచ్చే మెయిన్‌ రోడ్డు, తనిష్క్‌ ఫంక్షన్‌ హాలు వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. 


Read more