-
-
Home » Andhra Pradesh » Media has become polarized in AP Jagan bbr-MRGS-AndhraPradesh
-
Jagan: ఏపీలో మీడియా పోలరైజ్ అయిపోయింది: జగన్
ABN , First Publish Date - 2022-09-19T21:46:24+05:30 IST
మరోసారి మీడియా (Media)పై సీఎం జగన్ (CM Jagan) అక్కసు వెళ్లగక్కారు. ఏపీలో మీడియా పోలరైజ్ అయిపోయిందని

అమరావతి: మరోసారి మీడియా (Media)పై సీఎం జగన్ (CM Jagan) అక్కసు వెళ్లగక్కారు. ఏపీలో మీడియా పోలరైజ్ అయిపోయిందని, దుర్బుద్ధితో నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తోందని తప్పుబట్టారు. అసెంబ్లీలో జగన్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)లో పాలనలో కంటే.. వైసీపీ పాలనలో ఆర్థికవ్యవస్థ బాగుందని ఆధారాలతో చూపించామని తెలిపారు. ఏపీ పారిశ్రామిక రంగంపై దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ విమర్శించారు. ఏపీ ఆర్థికవ్యవస్థ బాగుందని ఆధారాలతో సహా చూపించామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Ease of Doing Business)లో ఏపీది ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. బల్క్ డ్రగ్ పార్కుతో 30 వేల ఉద్యోగాలిచ్చామని పేర్కొన్నారు. ఏపీకి బల్క్ డ్రగ్ పార్క్ (Bulk Drug Park) ఇస్తామని కేంద్రం అంటే.. టీడీపీ అడ్డుకుందని విమర్శించారు. బల్క్ డ్రగ్ పార్క్ కోసం 17 రాష్ట్రాలు పోటీపడ్డాయని, బల్క్ డ్రగ్ పార్క్ వల్ల ఎలాంటి పొల్యూషన్ ఉండదని తెలిపారు.
‘‘ఏం చేయగలుగుతామో అది మాత్రమే చెబుతున్నాం. గతంలో ఏది కావాలన్నా నాకెంత అనే ధోరణి ఉండేది. టీడీపీ హయాంలో పారిశ్రామికరంగాన్ని నిర్వీర్యం చేశారు. ఏపీలో 62,541 మందికి ఉపాధి కల్పించాం. మరో 40 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. 11.43 శాతం పారిశ్రామికాభివృద్ధితో ఏపీ దూసుకెళ్తోంది. టీడీపీ హయాంలో సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడులు వస్తే.. వైసీపీ హయాంలో సగటున రూ.12,702 కోట్ల పెట్టుబడులొచ్చాయి. రూ.91,121 కోట్ల విలువైన పది ప్రాజెక్ట్‌లపై చర్చలు జరిపాం. ఏపీకి రూ.46,280 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టుబడులకు ముందుకొస్తున్నాయి. ఏపీలో ప్రతిపక్షం తీరు దారుణంగా ఉంది. 3 ప్రాంతాల ఆత్మగౌరవాన్ని కాపాడుతామంటే ఏడుస్తారు. ఏపీ అభివృద్ధిపై ఏడవడం తప్ప ప్రతిపక్షం చేసిందేమీ లేదు. దురదృష్టవశాత్తు ఇలాంటి ప్రతిపక్షంతో మనం కాపురం చేస్తున్నాం’’ ’’ అని జగన్ తెలిపారు.