వినాయకుడు మీ సంకల్పాలన్నీ నెరవేర్చాలి: బాబు

ABN , First Publish Date - 2022-08-31T09:07:03+05:30 IST

గణనాధుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తున్న ప్రజలందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు వినాయక చతుర్ధి శుభాకాంక్షలు తెలిపారు.

వినాయకుడు మీ సంకల్పాలన్నీ నెరవేర్చాలి: బాబు

గణనాధుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తున్న ప్రజలందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు వినాయక చతుర్ధి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆ విఘ్నేశ్వరుడు మీ సంకల్పాలన్నింటినీ నెరవేర్చాలని, మీ ఇంటిల్లిపాదికి సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని మంగళవారం ట్వీట్‌ చేశారు. గణేష్‌ ఉత్సవాలపై అనుమతుల పేరుతో ఆంక్షలు సరికాదని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు. సకల దేవతా గణాలకు అధిపతి అయిన ఆ విఘ్నేశ్వరుడు తన కరుణా కటాక్షాలను మనందరిపై చూపాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. తెలుగు ప్రజలందరికీ ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఆ గణనాధుడు పాలకులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Read more