మంత్రి జోగి నా జేబులో మనిషి: కొడాలి

ABN , First Publish Date - 2022-12-10T02:26:55+05:30 IST

‘రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి జోగి రమేశ్‌ నా జేబులో మనిషి’ అంటూ నిండు సభలో మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యానించారు.

మంత్రి జోగి నా జేబులో మనిషి: కొడాలి

గుడివాడ, డిసెంబరు 9: ‘రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి జోగి రమేశ్‌ నా జేబులో మనిషి’ అంటూ నిండు సభలో మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యానించారు. శుక్రవారం గుడివాడలో బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. నాని మాట్లాడుతూ, మంత్రిగా జోగి రమేశ్‌ ఉంటే నాతోపాటు మాజీ మంత్రి పేర్ని నాని, గన్నవరం ఎమ్మె ల్యే వల్లభనేని వంశీమోహన్‌ల పనులేవీ ఆగవని అన్నారు. కొడాలి నాని ఈ వ్యాఖ్యలపై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. ‘‘బీసీల కార్యక్రమంలో ఒక బీసీ మంత్రిపై కొడాలి నాని అవమానకర వ్యాఖ్యలు బాధాకరం. ఇంత జరుగుతున్నా బీసీ నాయకులు నోరు మెదపకుండా కూర్చోవడం విచారకరం. నాని బహిరంగ క్షమాపణ చెప్పాలి. కొడాలి నానికి బీసీలు గట్టి గుణపాఠం చెప్పాలి’’ అని మాజీ ఎమ్మెల్యే రావి అన్నారు.

Updated Date - 2022-12-10T02:26:56+05:30 IST