మంత్రాలయంలో ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రియుడి మృతి

ABN , First Publish Date - 2022-10-06T03:57:20+05:30 IST

మంత్రాలయంలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియుడు వేణు మృతి చెందగా..

మంత్రాలయంలో ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రియుడి మృతి

కర్నూలు: మంత్రాలయంలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియుడు వేణు మృతి చెందగా.. ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో యువతిని ఆస్పత్రికి తరలించారు.


కాగా మంత్రాలయానికి చెందిన యువకుడు వేణు.. స్థానిక యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు.


అయితే వాళ్లు ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో యువతీయువకుడు మనస్థాపం చెందారు. నిద్ర మాత్రలు మింగి బలవన్మరణానికి యత్నించారు. వీరిలో యువకుడు వేణు మృతి చెందాడు. యువతి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. యువకుడు వేణు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Read more