చిన్నశేష, హంస వాహనాలపై మలయప్ప

ABN , First Publish Date - 2022-09-29T09:35:51+05:30 IST

చిన్నశేష, హంస వాహనాలపై మలయప్ప

చిన్నశేష, హంస వాహనాలపై మలయప్ప

తిరుమల, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తిరుమల బ్రహ్మోత్సవాల్లో బుధవారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనంపై శ్రీవేంకటేశ్వర స్వామి తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. శ్రీవారు బద్రినారాయణ అలంకరణలో ఐదుపడగల చిన్నశేష వాహనంపై ఆశీనులయ్యారు. 8గంటలకు ప్రారంభమైన వాహనసేవ రెండు గంటలపాటు సాగింది. రాత్రి 7గంటలకు విశేషమైన శ్వేత వస్త్రాలను ధరించి సరస్వతిదేవి అలంకారంతో జ్ఞానమూర్తిగా పురవీధుల్లో ప్రకాశించారు.  గురువారం సింహ,ముత్యపు పందిరి వాహనాలపై శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. కాగా, తిరుమల క్షేత్రంలో  నాలుగు రోజులుగా భక్తుల రద్దీ తక్కువగా కనిపిస్తోంది. కేవలం 30 నిమిషాల నుంచి గంట వ్యవధిలోనే భక్తులు గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకుంటున్నారు. వాహనసేవలు నిర్వహించే మాడవీధుల్లోని గ్యాలరీలు కూడా ఖాళీగానే కనిపించాయి.  


Read more