రవ్వలకొండ మైనింగ్‌పై న్యాయపోరాటం: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-03-16T09:14:26+05:30 IST

వైసీపీ నేతల అక్రమ మైనింగ్‌పై పోరాటం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. బనగానపల్లి మండలం రవ్వలకొండ గుహలో పోతులూరి

రవ్వలకొండ మైనింగ్‌పై న్యాయపోరాటం: చంద్రబాబు

అమరావతి, మార్చి15 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతల అక్రమ మైనింగ్‌పై  పోరాటం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. బనగానపల్లి మండలం రవ్వలకొండ గుహలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారు 450ఏళ్ల క్రితం 12 ఏళ్లు తపస్సు చేసి, కాలజ్ఞానం రాశారని, అలాంటి పవిత్రమైన,  చారిత్రాత్మకమైన రవ్వలకొండను సైతం ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మాజీ చైర్మన్‌ కనకాచారి, పరిరక్షణ సమితి అధ్యక్షుడు అరుణాచారి, విశ్వకర్మసంఘ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మానందరావు, పౌరోహిత్య సంఘ అధ్యక్షుడు గోవర్ధనశాస్త్రి తదితరులు చంద్రబాబుకు వివరించారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ రవ్వలకొండ అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే పార్టీ తరఫున న్యాయపోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు.

Read more