-
-
Home » Andhra Pradesh » Lifting of two gates of Srisailam reservoir nandyal andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
AP News: శ్రీశైలం జలాశయం రెండు గేట్లు ఎత్తివేత
ABN , First Publish Date - 2022-10-11T14:29:36+05:30 IST
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు జలాశయం 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

నంద్యాల: శ్రీశైలం జలాశయాని (Srisailam reservoir)కి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు జలాశయం 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో : 1,07,920 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 1,22,354 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను.. ప్రస్తుతం 884.70 అడుగుల మేర నీటి మట్టం కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా... ప్రస్తుతం నీటి నిల్వ 213,8824 టీఎంసీలుగా నమోదు అయ్యింది. మరోవైపు కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.