కీచక తండ్రికి జీవిత ఖైదు

ABN , First Publish Date - 2022-02-23T08:35:42+05:30 IST

కన్నకూతురిపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి జీవితఖైదీతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు

కీచక తండ్రికి జీవిత ఖైదు

విజయనగరం క్రైం, ఫిబ్రవరి 22: కన్నకూతురిపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి జీవితఖైదీతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. విజయనగరం జిల్లా ఎస్పీ దీపికాపాటిల్‌ తెలిపిన వివరాలు...విజయనగరానికి చెందిన ఓ వ్యక్తి భార్య ఇంట్లో లేని సమయంలో పదేళ్ల కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2020 మార్చి 13న దిశా మహిళా పీఎస్‌ ఎస్‌ఐ శ్యామలాదేవి పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. విచారించిన పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి షేక్‌ సికిందర్‌ భాషా నిందితుడికి జీవితఖైదుతో పాటు రూ.50 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. 

Read more