-
-
Home » Andhra Pradesh » Latest Update about Tirumala Balaji Darsan ssr-MRGS-AndhraPradesh
-
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి సర్వ దర్శనానికి 48 గంటల సమయం
ABN , First Publish Date - 2022-08-14T03:59:34+05:30 IST
వరుస సెలవులు రావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కంపార్టుమెంట్లు నిండి క్యూ లైన్ వెలుపలికి వచ్చిందంటే..

తిరుమల: వరుస సెలవులు రావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కంపార్టుమెంట్లు నిండి క్యూ లైన్ వెలుపలికి వచ్చిందంటే.. ఏ స్థాయిలో భక్తుల రద్దీ ఉందో అర్థం చేసుకోవచ్చు. గోగర్భం డ్యామ్ వరకు భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 48 గంటల సమయం పడుతుందని తెలిసింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఈనెల 20 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆగస్ట్ 13, 14 వారాంతపు సెలవులు, ఆగస్ట్ 15 పబ్లిక్ హాలిడే ఉండటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆ శ్రీనివాసుని దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లడంతో దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది.