-
-
Home » Andhra Pradesh » Lanka Dinakar comments anr-MRGS-AndhraPradesh
-
Lanka Dinakar: ఏపీలో కట్టుతప్పిన పాలన కనబడుతోంది...
ABN , First Publish Date - 2022-09-28T18:05:36+05:30 IST
బీజేపీ నేత లంకా దినకర్ (Lanka Dinakar) జగన్ ప్రభుత్వం (Jagan Govt.)పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

అమరావతి (Amaravathi): బీజేపీ నేత లంకా దినకర్ (Lanka Dinakar) జగన్ ప్రభుత్వం (Jagan Govt.)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాగ్ (Cog) నెలవారీ ఆర్థిక సమాచారం ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలోని మొదటి నాలుగు నెలల్లో జూలై నాటికే ఏపీ (AP)లో రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ కట్టుతప్పిన పాలన కనబడుతోందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్ర రెవిన్యూలోటు అంచన రూ. 17,036.15 కోట్లు అయితే, జూలై 2022 నాటికే రూ. 220.06 శాతం.. అంటే రూ. 37,489.24 కోట్లకు చేర్చారన్నారు. జూన్ నుంచి జూలై మధ్య రూ. 11,000 కోట్లకు పైగా రెవిన్యూలోటు పెరగడం రాష్ట్ర ఆర్థిక దౌర్బాగ్యస్థితి అర్థమవుతోందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ద్రవ్య లోటు అంచన రూ. 48,724.11 కోట్లు అయితే, జులై 2022 నాటికే 86.57 శాతం అంటే రూ. 42,181.32 కోట్లకు చేరడానికి కారణం అదుపు తప్పిన రెవిన్యూలోటేనన్నారు. మిగత 8 నెలల కాలం ఏపీలో ఇంకెన్ని అదుపులేని గణాంకాలను విశ్లేషించాలో అనే ఆలోచన ఊహించడానికే భయానకంగా ఉందన్నారు.
రుణాలు ఇంత భారీగా పెరిగినా.. 2022-23 ఆర్థిక సంవత్సరం అంచనా మూలధన వ్యయం రూ. 29,916.84 కోట్లలో మొదటి నాలుగు నెలల్లో ఖర్చు చేసింది కేవలం రూ. 2,993.99 కోట్లు మాత్రమేనని.. అంటే అంచనాలో 10.01 శాతమని లంకా దినకర్ అన్నారు. రాష్ట్రంలో అనుత్పాదక వ్యయం కొండంత అయితే భవిష్యత్తు ఆదాయం, ఉద్యోగ, ఉపాధి అందించే మూలధన వ్యయం గోరంతని... కేంద్ర ప్రభుత్వం వడ్డిలేని 50 ఏళ్ల దీర్ఘకాలిక రుణాలు ఒక లక్ష కోట్లలో మూలధన వ్యయం లక్ష్యాలను చేరలేక ఏపీ తన వాట అందుకకోలేక చతికిల పడుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు, పథకాల ద్వార నిధులు రాష్ట్ర బడ్జెట్ ఆదాయంలో 50 శాతం ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వ అద్వాన ఆర్థిక నిర్వహణ వల్ల ఇబ్బందులు వస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వకుండా ఆలస్యం చేసి ప్రజలకు వాస్తవాలు తెలియకుండా చేయాలని ప్రయత్నిస్తోందని లంకా దినకర్ ఆరోపించారు.