మంటల్లో పడి యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-03-04T12:11:09+05:30 IST

బేతంచెర్ల మండలంలోని గూటిపల్లె గ్రామానికి చెందిన ఉన్నం ఆదినారాయణ (24) అనే యువకుడు మతిస్థిమితం

మంటల్లో పడి యువకుడి మృతి

కర్నూలు: బేతంచెర్ల మండలంలోని గూటిపల్లె గ్రామానికి చెందిన ఉన్నం ఆదినారాయణ (24) అనే యువకుడు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో చలిమంట వేసుకుంటూ ఆ మంటలో పడి మృతి చెందాడు. హెడ్‌ కానిస్టేబుల్‌ బీవీ రమణ గురువారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి కుమారుడు ఆదివానారయణ శివరాత్రి జాగరణ రోజు శివాలయం వద్ద చలిమంట కాపాడుకుంటూ ఆ మంటలో పడ్డాడు. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ గత రాత్రి మృతి చెందాడు. ఆదినారాయణ తల్లి చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ తెలిపారు.

Read more