అసంతృప్తిలో వైసీపీ ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2022-06-07T06:49:58+05:30 IST

వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా సగానికి పైగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు.

అసంతృప్తిలో వైసీపీ ఎమ్మెల్యేలు
జుమాలదిన్నెలో బాదుడే బాదుడులో పాల్గొన్న బీటీ నాయుడు, తిక్కారెడ్డి

 వైసీపీపై ఎమ్మెల్సీ బీటీ నాయుడు, తిక్కారెడ్డి ధ్వజం


కోసిగి, జూన్‌ 6: వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా సగానికి పైగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. సోమవారం జుమాలదిన్నె, గౌడుగల్లు, నేలకోసిగి, వందగల్లు గ్రామాల్లో మండల కన్వీనర్‌ జ్ఞానేష్‌ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, ప్రజలకు మంచి పరిపాలన జరగాలంటే.. జగన్‌ రెడ్డి దిగి పోవాలన్నారు. రాష్ట్రంలో నిత్యావసర ధరలు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను అమాంతం పెంచేసి సామాన్య ప్రజలపై భారాలు మోపారన్నారు. ప్రజలు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టించి పోలీసులతో కొట్టిస్తున్నారని అన్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలనాగిరెడ్డి నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేశారో ప్రజలకు తెలుసని, ఎన్నికలప్పుడు ఉత్తుత్తి హామీలు ఇచ్చి ఇంటికే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్‌ రెడ్డి, టీడీపీ నాయకులు నాడిగేని అయ్యన్న, ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి, జ్ఞానేష్‌, సాతనూరు కోసిగయ్య, కొండగేని వీరారెడ్డి, మైనార్టీ కార్యదర్శి ఉమర్‌, ఖలందర్‌, నర్సారెడ్డి, పంపాపతి, ఈరయ్య, కృష్ణారెడ్డి, నరసింహులు, లక్ష్మీకాంత్‌ పాల్గొన్నారు.


పత్తికొండ(దేవనకొండ): వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అప్పుల కుప్పగా మారిందని టీడీపీ మండల కన్వీనర్‌ విజయభాస్కర్‌గౌడ్‌ అన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా సోమవారం దేవనకొండ మండలంలోని పొట్లపాడు, కుంకనూరు, అలారుదిన్నె గ్రామాల్లో ర్యాలీ, ప్రజలతో మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారం వచ్చాక ధరల పెరుగుదలతో పాటు ప్రజాజీవనం భారంగా మారిందన్నారు.  ప్రజలు ఇప్పటికైనా మేలుకుని వచ్చే ఎన్నికలలో టీడీపీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బడిగింజల రంగన్న, ఉచ్చీరప్ప, మలకన్న, డీలర్‌ బండ్లయ్య, ఆకుల వీరేష్‌, మల్లికార్జునగౌడ్‌, భాస్కర్‌, నాగేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Read more