ప్రజాస్వామ్య విలువలను దిగజార్చిన వైసీపీ

ABN , First Publish Date - 2022-08-15T05:49:44+05:30 IST

ఎంతో మంది మహనీయుల త్యాగాలతో ఏర్పాటైన ప్రజాస్వామ్య విలువలను వైసీపీ దిగజార్చిందని టీడీపీ డోన్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు.

ప్రజాస్వామ్య విలువలను దిగజార్చిన వైసీపీ
మాట్లాడుతున్న ధర్మవరం సుబ్బారెడ్డి

డోన్‌, ఆగస్టు 14: ఎంతో మంది మహనీయుల త్యాగాలతో ఏర్పాటైన ప్రజాస్వామ్య విలువలను వైసీపీ దిగజార్చిందని టీడీపీ డోన్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. పట్టణంలోని 22వ వార్డులో ఆదివారం టీడీపీ ఆద్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తుండటం చాలా బాధాకరమన్నారు. వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మహిళలను అవమానపరిచేలా బూతులు మాట్లాడుతున్నా సీఎం జగన్‌ ఏమీ మాట్లాడకపోవడం దారుణమన్నారు. మళ్లీ చంద్రబాబు లాంటి రాష్ట్రానికి వస్తే తప్ప.. ప్రజాస్వామ్యానికి మనుగడ లేదని, అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నాయకులు సీఎం శ్రీనివాసులు, గంధం శ్రీనివాసులు, ప్రజా వైద్యశాల మల్లికార్జున,  శ్రీనివాసులు యాదవ్‌, అభిరెడ్డిపల్లె గోవిందు, గండికోట రామసుబ్బయ్య, ఎస్‌టీ హరున్‌, బాష్యం శ్రీధర్‌, పాల్‌రాజు, నీలం ప్రభాకర్‌, ఎల్‌ఐసీ శ్రీరాములు, పీరా, వినయ్‌ చౌదరి, ఆలిబాబా పాల్గొన్నారు.


‘ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి’


నియోజకవర్గంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుదామని టీడీపీ డోన్‌ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ సోమవారం డోన్‌లోని టీడీపీ కార్యాలయం ఆవరణలో ఉదయం 8 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని జెండా పండుగను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


Updated Date - 2022-08-15T05:49:44+05:30 IST