కోసిగిలో దారుణం

ABN , First Publish Date - 2022-09-27T04:33:42+05:30 IST

తండ్రిని కొడుకు అతిదారుణంగా గొడ్డలితో నరికి చంపిన ఘటన కర్నూలు జిల్లా కోసిగిలో చోటు చేసుకుంది.

కోసిగిలో దారుణం
కోసిగిలో కుమారుడి చేతిలో దారుణహత్యకు గురైన నాగన్నగేరి కొవ్వు ఈరయ్య

తండ్రిని హత్య చేసిన తనయుడు

కోసిగి, సెప్టెంబరు 26: తండ్రిని కొడుకు అతిదారుణంగా గొడ్డలితో నరికి చంపిన ఘటన కర్నూలు జిల్లా కోసిగిలో చోటు చేసుకుంది. తండ్రిని కొడుకు అతిదారుణంగా గొడ్డలితో నరికి చంపిన ఘటన కర్నూలు జిల్లా కోసిగిలో చోటు చేసుకుంది. సీఐ ఎరిషావలి వివరాల మేరకు.. కోసిగిలోని 2వ వార్డు నాగన్నగేరి కాలనీకి చెందిన కొవ్వు ఈరయ్య (45) కుమారుడు కొవ్వు నరసింహులు పనీపాట లేకుండా తిరుగుతున్నాడు. దీనికితోడు మద్యానికి బానిసయ్యాడు. అంతేగాకుండా ఓ అమ్మాయిని కూడా వేధిస్తున్నట్లు తండ్రికి తెలియడంతో రెండు రోజుల క్రితం కుమారుడిని మందలించాడు. ఇది మనసులో పెట్టుకున్న నరసింహులు ఆదివారం రాత్రి ఇంట్లో పడుకున్న తండ్రి ఈరయ్యను అతి దారుణంగా గొడ్డలితో మెడపై నరికి చంపాడు. ఆ తరువాత గొడ్డలిని పట్టుకుని వీధిలో హల్‌చల్‌ చేశాడు. కోపోద్రిక్తులైన స్థానికులు నరసింహులును పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. మృతుడు కుమార్తె తలారి నాగవేణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  
Read more