జిల్లా అభివృద్ధికి కృషి చేయండి: ఎంపీ

ABN , First Publish Date - 2022-09-24T06:39:20+05:30 IST

జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కర్నూలు ఎంపీ, జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ చైౖర్మన్‌ డా.సంజీవ్‌ కుమార్‌ అఽధికారులను ఆదేశించారు.

జిల్లా అభివృద్ధికి కృషి చేయండి: ఎంపీ

కర్నూలు(కలెక్టరేట్‌) సెప్టెంబరు 23: జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కర్నూలు ఎంపీ, జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ చైౖర్మన్‌ డా.సంజీవ్‌ కుమార్‌ అఽధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సం బంధించిన అభివృద్ధి పథకాల అమలుపై ఎంపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకాల అమలులో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. దిశ కమిటీ సభ్యులు ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎంపీ మాట్లాడుతూ రోగుల పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని అన్నారు. దిశ కమిటీ సభ్యులు నరసింహయ్య మాట్లాడుతూ వెంకటరమణ కాలనీలో ఫ్లైఓవర్‌ బ్రిడ్జి  నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ భార్గవ్‌ తేజ, డ్వామా పీడీ అమర్నాథ్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ సీఈవో నాసరరెడ్డి, సీపీవో అప్పలకొండ, డీపీవో నాగరాజునాయుడు, జిల్లా దిశ కమిటీ సభ్యులు కృష్ణారెడ్డి, నరసింహయ్య, రమేష్‌, రాజు, గుప్తా, వాణి, సర్పంచ్‌లు, ఎంపీపీలు పాల్గొన్నారు.Read more