ఎమ్మెల్యే మాట్లాడుతుండగానే వెళ్లిపోయారు..

ABN , First Publish Date - 2022-09-28T05:47:47+05:30 IST

నంద్యాల జిల్లా మహానందిలో ఓ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతుండగానే మహిళలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఎమ్మెల్యే మాట్లాడుతుండగానే   వెళ్లిపోయారు..
ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగానే బయటికి వెళ్లిపోతున్న మహిళలు

మహానంది, సెప్టెంబరు 27: నంద్యాల జిల్లా మహానందిలో ఓ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతుండగానే మహిళలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మూడో విడత చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం మహానందిలో మండల వెలుగు అధికారులు నిర్వహించారు. క్షేత్రం పరిసరాల్లోని పోచా విశ్రాంతి భవనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే షెడ్యూల్‌ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాల్సి ఉండగా సాయంత్రం 4 గంటల తర్వాత వచ్చారు. అయితే అప్పటి దాకా మహిళలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు, నాయకులు మాట్లాడిన తర్వాత చివరగా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రసంగిస్తుంగానే ఉన్నట్టుండి ఉక్కసారిగా మహిళలు బయటకు వెళ్లిపోయారు. ఓపికతో వినాలని, ఇది మీ కొరకు ఏర్పాటు చేసిన కార్యక్రమం అని ఎమ్మెల్యే కోరినా మహిళలు వినకుండా బయటకు వెళ్లిపోయారు. అధికారులు కూడా విజ్ఞప్తి చేసినా వెళ్లిపోయారు. చివరికి సభలో ఉన్న కొంతమంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులను ఇప్పించి అధికారులు కార్యక్రమాన్ని ముగించారు.

Read more