-
-
Home » Andhra Pradesh » Kurnool » Will you be arrested if CPS seeks termination-MRGS-AndhraPradesh
-
‘సీపీఎస్ రద్దు కోరితే అరెస్టు చేస్తారా?’
ABN , First Publish Date - 2022-04-25T05:02:39+05:30 IST
సీపీఎస్ రద్దు చేయాలని విజయవాడ సీఎంఓ కార్యాలయం ముట్టడికి వెళ్లకుండా అక్రమంగా తమను ముందస్తు అరెస్టు చేయడం దారుణమని యూటీఎఫ్ పట్టణ అధ్యక్షుడు సునీల్‌రాజ్‌కుమార్, నాగేష్, మండల అధ్యక్షుడు సుధాకర్, కార్యదర్శి రంగన్న అన్నారు.

ఆదోని(అగ్రికల్చర్), ఏప్రిల్ 24: సీపీఎస్ రద్దు చేయాలని విజయవాడ సీఎంఓ కార్యాలయం ముట్టడికి వెళ్లకుండా అక్రమంగా తమను ముందస్తు అరెస్టు చేయడం దారుణమని యూటీఎఫ్ పట్టణ అధ్యక్షుడు సునీల్‌రాజ్‌కుమార్, నాగేష్, మండల అధ్యక్షుడు సుధాకర్, కార్యదర్శి రంగన్న అన్నారు. ఆదివారం విజయవాడ వెళ్లకుండా ముందస్తుగా యూటీఎఫ్ నాయకులను టూటౌన పోలీసులు అరెస్టు చేసి స్టేషనకు తీసుకెళ్లారు. తెల్లవారుజాము నుంచే ఇళ్ల వద్ద వెళ్లి స్టేషనకి రావాలని లేదా గృహనిర్బంధంలో ఉండాలని పోలీసులు తమపై ఒత్తిడి చేశారని అన్నారు. సీపీఎస్ రద్దు చేయాలని కోరుతూ సీఎంఓ కార్యాలయం ముట్టడికి బయల్దేరిన తమను అరెస్టు చేయడం అన్యాయమని వారు అన్నారు.
ఎమ్మిగనూరు: సీపీఎస్ రద్దు చేయకుండా బైక్జాతా చేస్తున్న యూటీఎఫ్ నాయకులను అరెస్టుచేయడం సిగ్గుచేటని ఆ సంస్థ రాష్ట్ర కార్యదర్శి నాగమణి, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు అన్నారు. ఆదివారం యూటీఎఫ్ కార్యాలయంలో ముఖ్యకార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ అరెస్టులకు భయపడేదిలేదని అన్నారు.
పత్తికొండరూరల్: సీపీఎ్‌సను రద్దు చేస్తానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చిన వైఎస్ జగన ఇప్పుడు ఆ సంగతి మర్చిపోయి అరెస్టులకు పాల్పడటం సిగ్గు చేటని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి భాస్కర్, మాజీ జిల్లా కార్యదర్శి ప్రసాద్‌బాబు విమర్శించారు. సోమవారం విజయవాడలో జరిగే నిరసన కార్యక్రమానికి వెళ్లుతుండగా ఆదివారం ఎస్ఐ భూపాలుడు యూటీఎఫ్ జిల్లా కార్యదర్శితో పాటు నాయకులు రామమౌళి, నాగభూషణంలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మద్దికెర: సీపీఎస్ రద్దుకై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నివాసం ముట్టడి కార్యక్రమానికి యుటీఎఫ్ పిలుపు నిచ్చిన నేథప్యంలో మద్దికెర యుటీఎఫ్ నాయకులు ఎం.నాగరాజు, ఎంజీ. నాగరాజు, విశ్వనాథ్‌లను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకుని నిర్బంధించారు.
తుగ్గలిలో: అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని ఉపాధ్యాయుడు చాంద్‌భాషా అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన తుగ్గలిలో ఛలో విజయవాడ మహాధర్నాలో పాల్గొనడానికి వెళ్లుతున్నందుకు తుగ్గలి పోలీసులు నిర్భందించారని, ఇలా అరెస్టు చేయడంతో ఉద్యమాలు ఆగవని ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించేంత వరకు ఆందోళన చేస్తూనే ఉంటామన్నారు.
ఎమ్మిగనూరు: సీపీఎస్ రద్దుచేయాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం జరగాల్సిన నిరసన కార్యక్రమానికి హాజరు కాకుండా ఉపాధ్యాయ ఉద్యమ నాయకులను పోలీసులు ఆదివారం అదుపులోకి తీఉకున్నారు. ఎమ్మిగనూరు రూరల్‌పోలీసులు డీటీఎఫ్ జిల్లా అధ్యక్షడు కరెకృష్ణ, ఎస్టీయూ నాయకులు ప్రసన్న రాజు, బసవారాజులతో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషనకు తరలించారు.
కౌతాళం మండలంలో: యుటీఎఫ్ తలపెట్టిన చలో విజయవాడకు తరలివెళ్లకుండా ఉపాధ్యాయ సంఘం నాయకులను ఆదివారం కౌతాళం పోలీసులు ముందస్తుగా అరెస్టుచేసి స్టేషనకు తరలించారు. యుటీఎఫ్ మండల కార్యదర్శి ఓంకార్‌ను వెంటనే విడుదలచేయాలని సంఘం నాయకులు కృష్ణమూర్తి, నరసయ్యగౌడ్, జంబులింగయ్య, బసప్ప డిమాండ్ చేశారు.