భార్యపై భర్త కత్తితో దాడి

ABN , First Publish Date - 2022-09-08T06:16:33+05:30 IST

పట్టణంలోని కొత్తబస్టాండ్‌ సమీపంలో భార్యపై భర్త కత్తితో దాడి చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకొంది.

భార్యపై భర్త కత్తితో దాడి

కోడుమూరు, సెప్టెంబరు 7: పట్టణంలోని కొత్తబస్టాండ్‌ సమీపంలో భార్యపై భర్త కత్తితో దాడి చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కోడుమూరుకు చెందిన బోయ శశికళ, బోయ రాముడులకు 2005 సంవత్సరం వివాహం అయింది. వీరికి నలుగురు ఆడపిల్లలు. అయితే భర్త బోయ రాముడు భార్యపై అనుమానం పెంచుకోవడంతో గత మూడేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. నెల రోజుల కిందట తనను వేధింపులకు గురి చేస్తున్నాడని భర్తపై భార్య పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పెద్దల సమక్షంలో భార్య, భర్తలు కలిసి కాపురం చేస్తామని రాజీ పడ్డారు. భార్యపై అనుమానం పెంచుకొన్న భర్త, భార్యపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిని ప్రజలు అడ్డుకొని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Read more