మా కేసు ఏమైంది?

ABN , First Publish Date - 2022-02-23T05:54:55+05:30 IST

పట్టణంలో మురుగు కాలువల నిర్మాణం పేరుతో అక్రమంగా ఎక్స్‌కవేటర్‌తో బస్‌ షెల్టరును తొలగించి దురుసుగా ప్రవర్తించిన గుత్తేదారుడిపై పెట్టిన కేసు ఏమైందని మాజీ మంత్రి అఖిలప్రియ పట్టణ సీఐ కృష్ణయ్యను ప్రశ్నించారు.

మా కేసు ఏమైంది?
పోలీసులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి అఖిలప్రియ

  1. మాజీ మంత్రి అఖిలప్రియ


ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 22: పట్టణంలో మురుగు కాలువల నిర్మాణం పేరుతో అక్రమంగా ఎక్స్‌కవేటర్‌తో బస్‌ షెల్టరును తొలగించి దురుసుగా ప్రవర్తించిన గుత్తేదారుడిపై పెట్టిన కేసు ఏమైందని మాజీ మంత్రి అఖిలప్రియ పట్టణ సీఐ కృష్ణయ్యను ప్రశ్నించారు.  సోమవారం అర్థరాత్రి ఆమె సీఐతో మాట్లాడుతూ  పట్టణంలోని శోభాఘాట్‌ పక్కన వేసిన వెం చర్‌ ప్రహరీని తొలగించారంటూ భూమా కిశోర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును దృష్టిలో ఉంచుకొని తన అనుచరులను అరెస్టు చేసేందుకు హైదరాబాదుకు ఎందుకు  వెళ్తున్నారని, తన అనుచరుడు అశోక్‌ను ఉన్నపళంగా ఎందుకు అరెస్టు చేశారని నిలదీశారు. అతడ్ని వదిలేదాకా  స్టేషన్‌ నుంచి వెళ్లేది లేదని కూర్చున్నారు. భూమా కిశోర్‌రెడ్డి కంటే ముందు తాము కేసు పెట్టామని, ఆ కేసులో గుత్తేదారుడ్ని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. గుత్తేదారుడు వ్యవహారానికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు.  కిశోర్‌రెడ్డి కేసులో ఆధారాలు లేవని, అయినా తన అనుచరులను అరెస్టు చేసేందుకు వెంటపడటంలో అర్థం లేదని మాజీ మంత్రి అఖిలప్రియ సీఐతో అన్నారు. కాగా పోలీసులు అరెస్టు చేసిన అశోక్‌కు స్టేషన్‌లోనే ఫిట్స్‌ రావడంతో వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. తన అనుచరుడు కోలుకొనే వరకు ఆమె వైద్యశాలలో ఉండి మంగళవారం ఒంటి గంటకు ఇంటికి వెళ్లారు. ఈమె వెంట న్యాయవాదులు శిరివెళ్ల రమణయ్య, నోటరీ శివప్రసాదరా వు, టీడీపీ కార్యకర్తలు ఉన్నారు.   మంగళవారం ఉదయం మాజీ మం త్రి అఖిలప్రియ అనుచరుడు అశోక్‌ను పోలీసులు వదిలేశారు.


ఎస్పీని కలిసిన భూమా అఖిలప్రియ 


నంద్యాల(నూనెపల్లె)/ ఆళ్లగడ్డ: నంద్యాలలో ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డిని మంగళవారం మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కలిశారు. గత వారం రోజుల నుంచి ఆళ్లగడ్డలో జరుగుతున్న పరిణామాలను, తమపై వచ్చిన తప్పుడు ఫిర్యాదులను ఎస్పీకి దృష్టికి ఆమె తీసుకెళ్లారు. స్థానిక డీఎస్పీ బంగ్లా కార్యాలయంలో గంటపాటు ఆమె ఎస్పీతో మాట్లాడారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ఆళ్లగడ్డలో తమపై కొందరు తప్పుడు ఫిర్యాదులు చేసి అక్రమ కేసులు నమోదు చేశారని, వాటిని నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు. జరిగిన సంఘటనలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తగిన న్యాయం చేస్తామని, తప్పుడు ఫిర్యాదు చేసినట్లు విచారణ తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు.Read more