‘మహిళలపై హింసను నిరోధించాలి’

ABN , First Publish Date - 2022-12-10T00:33:08+05:30 IST

మహిళలు, బాలికలపై జరిగే హింసను నిరోధించేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని డిస్ర్టిక్ట్‌ లీగల్‌ సర్వీస్‌ అథారిటీ సెక్రటరీ సీనియర్‌ సివిల్‌ జడ్జి సీహెచ్‌వీ శ్రీనివాసరావు, స్పెషల్‌ జడ్జి మెజిస్ర్టేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ క్లాస్‌ కె.భార్గవి అన్నారు.

‘మహిళలపై హింసను నిరోధించాలి’

కర్నూలు(హాస్పిటల్‌), డిసెంబరు 9: మహిళలు, బాలికలపై జరిగే హింసను నిరోధించేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని డిస్ర్టిక్ట్‌ లీగల్‌ సర్వీస్‌ అథారిటీ సెక్రటరీ సీనియర్‌ సివిల్‌ జడ్జి సీహెచ్‌వీ శ్రీనివాసరావు, స్పెషల్‌ జడ్జి మెజిస్ర్టేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ క్లాస్‌ కె.భార్గవి అన్నారు. ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కర్నూలు అర్బన్‌ ఆధ్వర్యంలో మహిళలు, బాలికలపై జరిగే లైంగిక వేధిం పులు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైంగిక వేధింపుల నివారణ చట్టం 2013 గురించి అవ గాహన కల్పించారు. మహిళలు, బాలికలపై జరిగే హింసను నిరోధిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ కేఎల్‌ఆర్‌కే కు మారి, కర్నూలు అర్బన్‌ సీడీపీవో అనురాధ, అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామ సచివాలయ మహిళ సంరక్షణ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:33:18+05:30 IST