-
-
Home » Andhra Pradesh » Kurnool » Villagers obstructed the electricity workers-NGTS-AndhraPradesh
-
విద్యుత్ సిబ్బందిని అడ్డుకున్న గ్రామస్థులు
ABN , First Publish Date - 2022-09-08T06:09:47+05:30 IST
నెలవారి విద్యుత్ బిల్లులు నమోదు చేసేం దుకు వెళ్లిన విద్యుత్ సిబ్బందిని, బిల్లు కలెక్టర్‌ను గ్రామస్థులు నిలువరించి బిల్లులు నమోదును అడ్డుకున్న సంఘటన బుధవారం మండలంలోని పొదలకుంట, మదిరే గ్రామాల్లో చోటు చేసుకుంది.

కౌతాళం,
సెప్టెంబరు 7: నెలవారి విద్యుత్ బిల్లులు నమోదు చేసేం దుకు వెళ్లిన
విద్యుత్ సిబ్బందిని, బిల్లు కలెక్టర్‌ను గ్రామస్థులు నిలువరించి బిల్లులు
నమోదును అడ్డుకున్న సంఘటన బుధవారం మండలంలోని పొదలకుంట, మదిరే గ్రామాల్లో
చోటు చేసుకుంది. విద్యుత్ బిల్లులు నమోదు చేసేందుకు విద్యుత్ లైన్
ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులతో పాటు సిబ్బంది పోదల కుంట, మదిరే గ్రామాలకు
వెళ్లారు. బిల్లులు నమోదు చేస్తుండగా గమనించి గ్రామస్థులు లైన్
ఇన్‌స్పెక్టర్, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమ గ్రామాలో విద్యుత్
సమస్యలు, తాగునీటి సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించేదాకా బిల్లులు
నమోదు చేయోద్దని డిమాండ్ చేశారు. అంత వరకు విద్యుత్ బిల్లులు
చెల్లించబోమన్నారు. అనంతరం గ్రామంలో బస్టాండ్ దగ్గర నిరసన చేపట్టారు.
ప్రజలు మాట్లాడుతూ గత కొన్నిరోజులుగా గ్రామం లో ఉన్న సమస్యలను అధికారుల
దృష్టికి తీసుకెళ్లిన ఎవరూ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తప్పని పరిస్థితుల్లో అడ్డుకోవాల్సి వచ్చింద న్నారు. దీనిపై ఏఈ నరసన్నను
వివరణ కోరగా రెండు మూడు రోజుల్లో గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యను
పరిష్కరిస్తామన్నారు.