విద్యా దీవెన నగదు జమ

ABN , First Publish Date - 2022-03-17T05:13:10+05:30 IST

సచివాలయం నుంచి సీఎం జగన్‌ బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అక్టోబరు- డిసెంబరు, 2021 త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన లబ్ధి మొత్తాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు.

విద్యా దీవెన నగదు జమ

కర్నూలు(కలెక్టరేట్‌), మార్చి 16: సచివాలయం నుంచి సీఎం జగన్‌ బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అక్టోబరు- డిసెంబరు, 2021 త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన లబ్ధి మొత్తాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. కలెక్టర్‌ కోటేశ్వరరావు మాట్లా డుతూ జిల్లాలో జగనన్న విద్యా దీవెన కింద 88,055 మంది విద్యార్థుల కు గాను అర్హులైన 78,631 మంది తల్లుల ఖతాలలో రూ.51.99 కోట్లు జమ చేశామని తెలిపారు. 21,501 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.15.27 కోట్లు, 2165 మంది ఎస్టీ విద్యార్థులకు రూ.1.09 కోట్లు, 41,136 మంది బీసీ విద్యార్థులకు రూ.21.33 కోట్లు, 7133 మంది ఈబీసీ విద్యా ర్థులు రూ.5.78 కోట్లు, 12,400 మంది కాపు విద్యార్థులకు రూ.6.30 కోట్లు, 3,491 మంది ముస్లీం మైనారిటీ విద్యార్థులకు రూ.2.07 కోట్లు, 229 మంది క్రిస్టి యన్‌ మైనారిటీ విద్యార్థులు రూ.0.15కోట్లు లబ్ధి పొందారని తెలిపారు. 


 మెగా చెక్కు అందజేత


సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లాలో జగనన్న విద్యా దీవెనకు సంబంధించి 88,055 మంది విద్యార్థులకు గాను అర్హులైన 78,631 మంది తల్లుల ఖాతాలలో రూ.51.99 కోట్ల  మెగా చెక్కును విద్యార్థుల తల్లులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి కలెక్టర్‌ కోటేశ్వరరావు, జడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, నగర మేయర్‌ బీవై రామయ్య, డిప్యూటీ మేయర్‌ సిద్దారెడ్డి రేణుక, జేసీ(ఆసరా, సంక్షేమం) శ్రీనివాసులు, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ ప్రతాప్‌ సూర్య నారాయణరెడ్డి, బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ వెంకట లక్ష్మమ్మ, మైనార్టీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ మహబూబ్‌ బాషా, గిరిజన సంక్షేమశాఖ డీటీడబ్ల్యూవో, డీఎస్‌డబ్ల్యూవో చింతామణి పాల్గ్గొన్నారు.

Read more