‘8 టీఎంసీలతో వేదవతిని నిర్మించాలి’

ABN , First Publish Date - 2022-12-12T00:54:37+05:30 IST

వేదవతి ప్రాజెక్టును 8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించి ఆస్పరి మండలాన్ని ఆయకట్టు మండలంగా గుర్తించాలని ఆర్‌సీసీ నాయకులు కోరారు. ఈ డిమాండ్‌ మీద ఈ నెల 13న నిర్వహించే బైక్‌ యాత్రను విజయవంతం చేయాలని కోరారు.

 ‘8 టీఎంసీలతో వేదవతిని నిర్మించాలి’

ఆలూరు, డిసెంబరు 11: వేదవతి ప్రాజెక్టును 8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించి ఆస్పరి మండలాన్ని ఆయకట్టు మండలంగా గుర్తించాలని ఆర్‌సీసీ నాయకులు కోరారు. ఈ డిమాండ్‌ మీద ఈ నెల 13న నిర్వహించే బైక్‌ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఇందులో భాగంగా నేడు ఆలూరు కేంద్రంలోని గెస్ట్‌ హౌస్‌లో కరపత్రాలను విడుదల చేశారు. రాయలసీమ కో-ఆర్డినేషన్‌ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహయ్య మాట్లాడుతూ కర్నూలు పశ్చిమ ప్రాంతంలో కరువు, వలస నివారణ కావాలంటే వేదవతి ప్రాజెక్టును 8 టీఎంసీల పూర్తి స్థాయిలో నిర్మించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ప్రకాష్‌, సురేష్‌, ప్రతాప్‌, రవివర్మ, మునిస్వామి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T00:54:37+05:30 IST

Read more