ఇద్దరు నిందితుల అరెస్టు

ABN , First Publish Date - 2022-05-18T05:51:41+05:30 IST

ఆళ్లగడ్డ, చాగలమర్రి మండలాల్లో జరిగిన దారి దోపిడీ, దొంగతనం కేసుల్లో సురేంద్ర, నరసింహుడు అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 6.80 లక్షలు నగదు, యమహా మోటార్‌సైకిల్‌, కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ రాజేంద్ర చెప్పారు.

ఇద్దరు నిందితుల అరెస్టు

రిమాండ్‌కు తరలించిన పోలీసులు  


ఆళ్లగడ్డ, మే 17: ఆళ్లగడ్డ, చాగలమర్రి మండలాల్లో జరిగిన దారి దోపిడీ, దొంగతనం కేసుల్లో సురేంద్ర, నరసింహుడు అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 6.80 లక్షలు నగదు, యమహా మోటార్‌సైకిల్‌, కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ రాజేంద్ర చెప్పారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరాలు చెప్పారు. చాగలమర్రి మండలం పెద్దబోదనం గ్రామానికి చెందిన వంగాల పెద్ద వెంకట సుబ్బారెడ్డి అనే రైతు ఆళ్లగడ్డ పట్టణంలోని యూనియన్‌ బ్యాంకు నుంచి ఏప్రిల్‌ 26 వ తేదీన రూ.4.80 లక్షలు ఒంటరిగా మోటార్‌ సైకిల్‌పై తీసుకొని వెళ్తుండగా.. నంద్యాల పెద్దకొట్టాలకు చెందిన సురేంద్ర, రుద్రవరం మండలం పెద్దకంబలూరు గ్రామానికి చెందిన గువ్వల నరసింహుడు కత్తితో చంపుతామని బెదిరించి అతని వద్ద ఉన్న డబ్బులను లాక్కెళ్లిపోయారని అన్నారు.  అలాగే పట్టణంలోని ఓ ఇంట్లో ఏప్రిల్‌ 20న ఈ నిందితులే రూ. 2 లక్షలు దొంగిలించారని అన్నారు. వీరిని హైవే డాబా దగ్గర అరెస్టు చేశామని తెలిపారు.  పట్టణ సీఐ కృష్ణయ్య, రూరల్‌ సీఐ రాజశేఖరరెడ్డి, రూరల్‌ ఎస్‌ఐ నరసింహులు, వారి సిబ్బంది మురారి, షకిర్‌, చంద్రబాబు ఇందులో ఉన్నారని అన్నారు. నిందితుడు సురేంద్ర నంద్యాల్లో జరిగిన ఓ మర్డర్‌ కేసులో నిందితుడని డిఎస్పీ తెలిపారు. వీరిని రిమాండుకు తరలించామన్నారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ కృష్ణయ్య, రూరల్‌ సీఐ రాజశేఖరరెడ్డి, రూరల్‌ ఎస్‌ఐ నరసింహులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Read more