‘నిర్లక్ష్యంగా చేస్తే కఠిన చర్యలు’

ABN , First Publish Date - 2022-08-18T05:13:37+05:30 IST

జిల్లాలో నాడు - నేడు కింద చేపట్టిన పాఠశాలల భవన నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన హెచ్చరించారు.

‘నిర్లక్ష్యంగా చేస్తే కఠిన చర్యలు’

నంద్యాల టౌన, ఆగస్టు 17: జిల్లాలో నాడు - నేడు కింద చేపట్టిన పాఠశాలల భవన నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స హాల్‌లో మనబడి నాడు - నేడు రెండవ దశ పురోగతి పనులపై కలెక్టర్‌ జడ్పీ సీఈవో నాసర్‌రెడ్డి, డీఈవో వసుంధరతో కలిసి సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రెండో విడతలో చేపట్టిన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంఈవోలు, ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. నాడు - నేడు రెండో దశ పనుల కింద 981 పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, నీటి మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు జరుగుతున్నాయని తెలిపారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలాల్లోని పాఠశాలల వారిగా ప్రతిపాదనలు, ఖర్చు అంచనా తదితర అంశాలపై ఎంఈవోలు, ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీపై కలెక్టర్‌ ఆరా తీశారు. ప్రతిరోజు ఎంఈవోలు తమ పరిధిలోని పాఠశాలలను తనిఖీ చేసి లోటుపాట్లను సమీక్షించుకొని, నాణ్యమైన కిట్లు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

   


Read more