‘లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు’

ABN , First Publish Date - 2022-09-17T05:49:47+05:30 IST

గర్బస్థ లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డా.శశిభూషణ్‌ రెడ్డి హెచ్చరించారు.

‘లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు’

కర్నూలు(హాస్పిటల్‌), సెప్టెంబరు 16: గర్బస్థ లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డా.శశిభూషణ్‌ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో పీసీపీఎన్‌డీటీ సబ్‌ డిస్ర్టిక్ట్‌ లెవెల్‌ కమిటీ సమావేశం డీఐవో ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగ నిర్ధారణ మొదటి సారిగా చెసిన ట్లయితే 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తామన్నారు. రెండో సారి చేస్తే 5 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.50వేలు జరిమానా విధిస్తామ న్నారు. కొత్త రిజిస్ర్టేషన్లు, రెన్వూల్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వాటిని ప్రొగ్రామ్‌ ఆపీసర్లు తనిఖీ చేసి అన్ని సక్రమంగా ఉంటే వాటిని డీఎంహెచ్‌వోకు సమర్పించా లన్నారు. కర్నూలు డివిజన్‌లో ఉన్న జూనియర్‌, డిగ్రీ, నర్సింగ్‌ కళాశాలల్లో ఆడపిల్లల ప్రాముఖ్యత గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిం చాలని కమిటీ తీర్మానం చేశారు. కార్యక్రమంలో గైనాకలజిస్టు డా.దివ్యతేజ, ఏపీపీ సుబ్బ య్య, ఎన్‌జీవో ప్రతినిధి రాయపాటి శ్రీనివాసులు, డిప్యూటీ డెమో చంద్రశేఖర్‌ రెడ్డి, మానిటరింగ్‌ కన్సల్టెంట్‌ సుమలత పాల్గొన్నారు.


Read more