కందుకూరు మృతులకు నివాళి

ABN , First Publish Date - 2022-12-30T00:48:50+05:30 IST

నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నాయుడు సభకు హాజరై తొక్కిసలాటలో మృతి చెందిన కార్యకర్తలకు పతి ్తకొండ టీడీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు గురువారం నివాళి అర్పించారు.

కందుకూరు మృతులకు నివాళి

పత్తికొండ, డిసెంబరు 29: నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నాయుడు సభకు హాజరై తొక్కిసలాటలో మృతి చెందిన కార్యకర్తలకు పతి ్తకొండ టీడీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు గురువారం నివాళి అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి మాట్లాడుతూ ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలో కార్యకర్తలు మృతి చెంద డం బాధకరమన్నారు. నాయకులు రామానాయుడు, చల్లా రవీంద్రనాథ్‌చౌదరి, బీటీ గోవిం దు, సంజప్ప, తిప్పన్న, శ్రీనివాసులుగౌడ్‌, ఈశ్వరప్ప, విజయమో హన్‌రెడ్డి, సింగం శీను, ఈరమ్మ, మీరాహుసేన్‌, నరసింహులు పాల్గొన్నారు.

ఆదోని: కందుకూరులో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి రోడ్‌షోలో పాల్గొంటున్న చంద్రబాబును చూసేందుకు పెద్ద ఎత్తున జనాభా రావడంతో తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందడం దురదృష్టకరమని మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్లు భాస్కర్‌ రెడ్డి, దేవేంద్రప్ప అన్నారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో 8 మంది మృతి చెందిన టీడీపీ కార్యకర్తలకు సంతాపం తెలి పారు. నాయకులు మైనారిటీ నాయకులు సౌదీ రవూఫ్‌, ఫకృద్దీన్‌, గుడిసె శ్రీరాములు, రామచంద్ర, మురళి, సోమశేఖర్‌ రెడ్డి, గోపాల్‌, మల్లేష్‌ పాల్గొన్నారు.

ఆలూరు: కందుకూరులో టీడీపీ సభలో ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలో 8మంది మృతి చెందడం బాధాకరమని ఆలూరు మాజీ టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం శివప్రసాద్‌ అన్నారు. ఈ విషయాన్ని అడ్డుపెట్టుకొని వైసీపీ నాయకులు శవ రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబాలకు ఎన్టీఆర్‌ ట్రస్‌, టీడీపీ నేతలు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించారన్నారు. ఈ విషయాన్ని వైసీపీ నాయకులు స్వార్థ రాజకీయాలకు వాడుకుంటూ అనుకూల మీడియా, సోషల్‌ మీడియాలో అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

Updated Date - 2022-12-30T00:48:50+05:30 IST

Read more