ప్రకృతి వ్యవసాయ విభాగంలో 19 మంది బదిలీ

ABN , First Publish Date - 2022-10-04T05:23:01+05:30 IST

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రకృతి వ్యవసాయం కోసం కృషి చేసిన 19 మంది బదిలీ అయ్యారు.

ప్రకృతి వ్యవసాయ విభాగంలో  19 మంది బదిలీ

కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 3: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రకృతి వ్యవసాయం కోసం కృషి చేసిన 19 మంది బదిలీ అయ్యారు. వీరిని ప్రకృతి వ్యవసాయం డీపీఎం చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు నగరంలోని కార్యాలయంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని రైతుల ద్వారా అమలు చేసేందుకు సిబ్బంది ఎంతో కష్టపడ్డారని అన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన శనగలు, తదితర ఆహార ఉత్పత్తులను తిరుమల తిరుపతి దేవస్థానానికి అధిక ధరలకు రైతులు సప్లయ్‌ చేస్తున్నారని  డీపీఎం చంద్రశేఖర్‌ తెలిపారు. సమావేశంలో గతంలో డీపీఎంగా పని చేసిన ఆంజనేయులు, తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Read more