నేడు నంద్యాలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి

ABN , First Publish Date - 2022-02-23T05:59:33+05:30 IST

: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఏపీ కాంగ్రెస్‌ పార్టీ పరిశీలకుడు డాక్టర్‌ సీడీ మయప్పన్‌ బుధవారం నంద్యాలకు వస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ యాదవ్‌ మంగళవారం తెలిపారు.

నేడు నంద్యాలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి

నంద్యాల టౌన్‌, ఫిబ్రవరి 22: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఏపీ కాంగ్రెస్‌ పార్టీ పరిశీలకుడు డాక్టర్‌ సీడీ మయప్పన్‌ బుధవారం నంద్యాలకు వస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ యాదవ్‌  మంగళవారం తెలిపారు. భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదుపై అవగాహన సదస్సును డీసీసీ కార్యాలయం రాజీవ్‌ భవన్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా మయప్పన్‌తోపాటు ఏపీ కాంగ్రెస్‌ మహిళా విభాగం కార్యదర్శి, ఏఐసీసీ కార్యదర్శి హజీనా సయ్యద్‌ కూడా హాజరవుతున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమానికి నంద్యాల పార్లమెంట్‌ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతోపాటు పీసీసీ సభ్యులు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, పార్టీ అనుబంధ సంస్థల నాయకులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు. Read more