-
-
Home » Andhra Pradesh » Kurnool » tnsf leaders protest at rayalaseema university-NGTS-AndhraPradesh
-
‘విద్యార్థుల జీవితంతో చెలగాటం వద్దు’
ABN , First Publish Date - 2022-02-23T05:40:57+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ తన సొంత ప్రయోజనాల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, వెంటనే తన నిర్ణయాలను మార్చుకుని విద్యార్థులకు అవసరమైన ప్రయోజనాలను, ఇచ్చిన హామీల మేరకు నెరవేర్చకుంటే తగినమూల్యం చెల్లించుకోక తప్పదని టీఎన్‌ఎస్‌ఎఫ్ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు రామాంజినేయులు హెచ్చరించారు.

కర్నూలు(అగ్రికల్చర్), ఫిబ్రవరి 22: ముఖ్యమంత్రి జగన్ తన సొంత ప్రయోజనాల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, వెంటనే తన నిర్ణయాలను మార్చుకుని విద్యార్థులకు అవసరమైన ప్రయోజనాలను, ఇచ్చిన హామీల మేరకు నెరవేర్చకుంటే తగినమూల్యం చెల్లించుకోక తప్పదని టీఎన్‌ఎస్‌ఎఫ్ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు రామాంజినేయులు హెచ్చరించారు. రాయలసీమ యూనివర్సిటీ ప్రాంగణంలో పీజీ విద్యార్థులు మెస్ చార్జీలు చెల్లించలేదన్న కారణంతో వారిని హాస్టళ్లకు వెళ్లకుండా నిలిపివేయడాన్ని నిరసిస్తూ మంగళవారం నిరసన చేపట్టారు. రామాంజనేయులు మాట్లాడుతూ విద్యాదీవెన, వసతి దీవెన తదితర పతకాలను పేద విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులేకుండా విద్యను కొనసాగిస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారని గుర్తుచేశారు. అయితే ఫీజులను వారికి చెల్లించడంలో విఫలమయ్యారని, అందువల్ల కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు నష్టం కలిగిస్తున్నాయని ఆరోపించారు. వెంటనే జగనన్న తోడు, విద్యాదీవెన పతకాలకు సంబంధించి విద్యార్థుల తల్లుల అకౌంట్లకు డబ్బులు జమ చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని రామాంజనేయులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వడ్డె ఎల్లప్ప, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.