టీడీపీ హయాంలోనే గ్రామాలు సస్యశ్యామలం

ABN , First Publish Date - 2022-01-24T04:36:37+05:30 IST

టీడీపీ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు సస్యశ్యా మలంగా తీర్చిదిద్దారని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

టీడీపీ హయాంలోనే గ్రామాలు సస్యశ్యామలం
సమావేశంలో మాట్లాడుతున్న గౌరు చరితారెడ్డి

పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి 

ఓర్వకల్లు, జనవరి 23: టీడీపీ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు సస్యశ్యా మలంగా తీర్చిదిద్దారని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని హుశేనాపురం గ్రామంలో మాజీ జడ్పీ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌ ఆధ్వర్యంలో గౌరవ సభ, ప్రజా సమస్యల చర్చా వేదిక కార్యక్రమం జరిగింది. ఆమెకు మేళతాళాలతో, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. గ్రామమంతా బ్యానర్లు, పసుపు జెండాలతో కళకళలాడింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత, మాజీ జడ్పీ చైర్మన్‌ రాజశేఖర్‌ భారీ కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు అందిం చారు. అనంతరం టీడీపీ నాయకుడు మహబూబ్‌ బాషా ఆధ్వర్యంలో వారికి భారీ గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్‌ పాదయాత్రలో ముద్దులు పెడుతూ అధికారంలోకి వచ్చాక.. ప్రజలపై గుద్దులు గుద్దుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఓటీఎస్‌ డబ్బులు ఎవరూ కట్టవద్దని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా ఇళ్ల రిజిస్ర్టేషన్లు చేయించి ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నంద్యాల పార్లమెంటు ఉపాధ్యక్షుడు మోహన్‌ రెడ్డి, మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి, మాజీ ఎంపీపీ లక్ష్మణరావు, నాయకులు మహబూబ్‌బాషా, సుధాకర్‌, రామగోవిందు, మురళి పాల్గొన్నారు.

Read more