-
-
Home » Andhra Pradesh » Kurnool » The Tungabhadra river is fierce-NGTS-AndhraPradesh
-
తుంగభద్ర నది ఉగ్రరూపం
ABN , First Publish Date - 2022-07-18T06:19:06+05:30 IST
ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య ప్రవహిస్తున్న తుంగభద్రమ్మ ఉగ్రరూపం దాల్చింది.

- 1.55 లక్షల క్యూసెక్కులతో పరవళ్లు
- డేంజర్ లెవల్‌కు చేరిన నీటి మట్టం
- కొనసాగుతున్న పోలీసు బందోబస్తు
మంత్రాలయం, జూలై 17: ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య ప్రవహిస్తున్న తుంగభద్రమ్మ ఉగ్రరూపం దాల్చింది. రెండు రాష్ట్రాల సరిహద్దులను తాకుతూ పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం టీబీ డ్యాం నుంచి 1.51 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో మంత్రాలయం వద్ద 1,55,381 క్యూసెక్కులతో 311.910 మీటర్ల నీటి మట్టంతో డేంజర్ స్థాయికి చేరుకుంది. నదిలో గంట గంటకు తుంగభద్ర నదిలో నీటి మట్టం పెరుగుతుండటంతో మంత్రాలయం తహసీల్దార్ చంద్రశేఖర్, సీఐ భాస్కర్, ఎస్ఐ వేణుగోపాల్ రాజు, మఠం మేనేజర్ వెంకటేష్ జోషి, జోనల్ మేనేజర్ శ్రీపతాచార్లు నదితీరంలో పోలీసు బందోబస్తును కొనసాగిస్తున్నారు. మఠం సెక్యూరిటీ, రెవెన్యూ సిబ్బంది, వలంటీర్లతో బారీ కేడ్లను ఏర్పాటు చేసి నదిలోకి ఎవరినీ వెళ్లనీయకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. నది తీరంలో పంట పొలాలు పత్తి, మిరప, వరి తదితర పంటలు నీటమునిగాయి. రాంపురం, మాధవరం, చెట్నహల్లి, మంత్రాలయం వద్ద విద్యుత మోటార్లు నీటిలో మునిగిపోయాయి. మాధవరం పంపు హౌస్ వద్ద విద్యుత సబ్ స్టేషనలోకి నీరు చేరింది.