నీతి నిజాయితీకి పేరు కోట్ల

ABN , First Publish Date - 2022-09-28T06:10:39+05:30 IST

నీతి నిజాయితీకి నిలువుటద్దం కోట్ల విజయభాస్కరరెడ్డి అని డీసీసీ అధ్యక్షుడు ఎం.సుధాకర్‌ బాబు అన్నారు.

నీతి నిజాయితీకి పేరు కోట్ల
కోట్ల చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

ఘనంగా వర్ధంతి వేడుకలు

కర్నూలు(అర్బన్‌), సెప్టెంబరు 27: నీతి నిజాయితీకి నిలువుటద్దం కోట్ల విజయభాస్కరరెడ్డి అని డీసీసీ అధ్యక్షుడు ఎం.సుధాకర్‌ బాబు అన్నారు. మంగళవారం నగరంలోని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కోట్ల విజయభాస్కరరెడ్డి 21వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సుధాకర్‌ బాబు మాట్లాడుతూ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన మహానేత కోట్ల అని కొనియాడారు. విలువలకు, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయం చేశారని గుర్తు చేశారు. ఎంతో మందికి చిన్న పేపర్‌ ముక్క ద్వారా సిఫారసు చేసి ఉద్యోగాలు ఇప్పించారని అన్నారు. అంతక ముందు పార్టీ నాయకులు స్థానిక కోట్ల సర్కిల్‌లో కోట్ల విజయభాస్కరరెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేశారు. సిటీ అధ్యక్షుడు జాన్‌ విల్సన్‌, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు బి.బ్రతుకన్న, దామోదరం రాధాకృష్ణ, సత్యరాజ్‌, షేక్‌ ఖాజాహుసేన్‌, సుంకన్న, ఎ. రాజేంద్ర ప్రసాద్‌, దేవదాసు, ప్రమీల, సారమ్మ, వెంకటలక్ష్మి, మద్దమ్మ పాల్గొన్నారు.

గూడూరు: పట్టణ టీడీపీ అధ్యక్షుడు గజేంద్ర గోపాల్‌ నాయుడు ఆధ్వ ర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయబాస్కర రెడ్డి వర్ధంతిని టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మంగళవారం గూడూరులో  కోట్ల విజయబాస్కర రెడ్డి చిత్ర పటా నికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గజేంద్ర గోపాల్‌ నాయుడు మాట్లాడుతూ మచ్చలేని మహా నాయకుడు కోట్ల విజయబాస్కర రెడ్డి అని కోనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగప్ప యాదవ్‌, మన్నన్‌బాష, కళ్యాణ్‌ రఘుబాబు, తులసీకృష్ణ, రవి పాల్గొన్నారు.


కోడుమూరు:
దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఆదర్శంగా తీసుకోవాలని సర్పంచు భాగ్యరత్న అన్నారు. కోట్ల విజయభాస్క ర్‌రెడ్డి వర్ధంతిని మంగళ వారం ఘనంగా నిర్వహించారు. ముందుగా పంచాయతీ కార్యాలయంలో కోట్ల చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ర్యాలీగా పాతబస్టాండ్‌లోని కోట్ల సర్కి ల్లోని కోట్ల కాంస్య విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచు కేయి రాంబాబు, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు హేమాద్రిరెడ్డి, మధుసూద న్‌రెడ్డి, టీడీపీ కర్నూలు పార్లమెంటు ఉపాధ్యక్షుడు కేఈ మల్లికార్జునగౌడ్‌, టీడీపీ మండల ఉపాధ్యక్షుడు గుంతకంటి వేణుగోపాల్‌రెడ్డి, పట్టణ కార్యదర్శి ఎల్లప్పనాయుడు, టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కేఈ రఘుబాబు, టీడీపీ రైతు సంఘం నాయకులు తిరుమల్‌నాయుడు, బడె సాగౌడ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-28T06:10:39+05:30 IST