కంకణధారణతో ఉత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-10-01T05:00:04+05:30 IST

దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవాలు కంకణాధారణతో శుక్రవారం ప్రారంభమయ్యాయి.

కంకణధారణతో ఉత్సవాలు ప్రారంభం
నెరణికి గ్రామం నుంచి మాళమల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను దేవరగట్టుకు తీసుకెళ్తున్న దృశ్యం

దేవరగట్టుకు చేరుకున్న మాళమల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలు

హొళగుంద, సెప్టెంబరు 30: దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవాలు కంకణాధారణతో శుక్రవారం ప్రారంభమయ్యాయి. నెరణికి గ్రామంలో కొలువై ఉన్న మాళమల్లేశ్వర స్వామి ఉత్సవమూర్తులను నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాలకు చెందిన భక్తులు, ఆలయ కమిటీ నిర్వాహకులు ఊరేగుంపుగా దేవరగట్టుకు చేర్చారు. అనంతరం ఆలయ అర్చకులు మల్లయ్య స్వామి, స్వామివారి విగ్రహాలకు పాదాల కట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి కంకణధారణ మహోత్సవాన్ని వైభవంగా చేపట్టారు. అక్టోబరు 5వ తేదీన జరిగే దసరా దేవరగట్టు (బన్ని) ఉత్సవాలు ప్రధాన వేదికగా నిలుస్తాయి. శుక్రవారం రాత్రి మాళమల్లేశ్వర స్వామి కంకణధారణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.


Read more