‘సిద్ధన్న గట్టు’కు క్లాప్‌ కొట్టిన గౌరు

ABN , First Publish Date - 2022-04-25T05:06:37+05:30 IST

బ్రాహ్మణకొట్కూరులో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా పార్లమెంట్‌ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి స్వగృహంలో సిద్ధన్న గట్టు సినిమా షూటింగ్‌ ఆదివారం మొదలైంది.

‘సిద్ధన్న గట్టు’కు క్లాప్‌ కొట్టిన గౌరు
సుమన్‌పై క్లాప్‌ కొడుతున్న గౌరు

నందికొట్కూరు రూరల్‌, ఏప్రిల్‌ 24 : బ్రాహ్మణకొట్కూరులో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా పార్లమెంట్‌ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి స్వగృహంలో సిద్ధన్న గట్టు సినిమా షూటింగ్‌ ఆదివారం మొదలైంది. ఈ సందర్భంగా నటుడు సుమన్‌పై క్లాప్‌ కొట్టి గౌరు సినిమా షూటింగ్‌ను ప్రాంబించారు. ఈ సందర్భంగా సుమన్‌ మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్‌ ఈ నెల 27వ తేదీ వరకు ఈ పరిసర ప్రాంతాలలో జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సినిమా డైరెక్టర్‌ మనూ, నిర్మాత జలీల్‌బాషా, మేనేజర్‌ చిన్న నరసింహులు తదితరులు పాల్గొన్నారు. 

Read more