బావిలో పడి బాలుడి మృతి

ABN , First Publish Date - 2022-05-18T05:54:15+05:30 IST

పట్టణంలోని బుడ్డేకల్లు ప్రాంతానికి చెందిన అజీస్‌, రేష్మా దంపతుల రెండో కుమారుడు అయాన్‌ (13) ప్రమాదవశాత్తు బావిలో పడి మంగళవారం మృతి చెందాడు.

బావిలో పడి బాలుడి మృతి

ఆదోని, మే 17: పట్టణంలోని బుడ్డేకల్లు ప్రాంతానికి చెందిన అజీస్‌, రేష్మా దంపతుల రెండో కుమారుడు అయాన్‌ (13) ప్రమాదవశాత్తు బావిలో పడి మంగళవారం మృతి చెందాడు. పోలీసులు వివరాల మేరకు.. అయాన్‌ అనే బాలుడు స్థానిక మసూదీయా పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఇరువురు స్నేహితులతో కలిసి నిజాముద్దీన్‌ కాలనీలో ఉన్న చౌదరి బావి వద ్దకు వెళ్లాడు. మెట్లు దిగుతుండగానే ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయాడు. నీటితో మునుగుతుండగా తనతోపాటు వెళ్లిన మిత్రులు గట్టిగా కేకలు వేశారు. అక్కడే ఉన్న స్థానికులు బావిలో దూకి ఆయాన్‌ను బయటకు తీశారు. వెనువెంటనే ఏరియాసుపత్రికి తరలించచగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రులు అజీస్‌, రేష్మా విలపిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. 

Read more