-
-
Home » Andhra Pradesh » Kurnool » tg venkatesh comments anr-MRGS-AndhraPradesh
-
TG Venkatesh: కృష్ణంరాజు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన టీజీ
ABN , First Publish Date - 2022-09-11T16:33:26+05:30 IST
కృష్ణంరాజు మృతి పట్ల.. మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ..తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.

కర్నూలు (Kurnool): ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు (Krishnam Raju) మృతి పట్ల.. మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ (TG Venkatesh)..తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. కృష్ణంరాజు మృతి సినీ రంగానికి, రాజకీయ రంగానికి తీరని లోటని అన్నారు. సినిమా రంగానికి, సమాజానికి ఎంతో విలువలతో కూడినటువంటి సేవలందించారని కొనియాడారు. సీనియర్ పార్టీ నేతగా, మాజీ కేంద్ర మంత్రిగా ఆయన భారతీయ జనతా పార్టీకి ఎనలేని సేవలు అందించారని, జాతీయస్థాయి రాజకీయాల్లో ఎటువంటి మచ్చ లేకుండా చురుకైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి కృష్ణంరాజని టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.